![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -855 లో... రిషి కోసం వసుధార ఇంటికి వస్తుంది ఏంజిల్. ఏంజిల్ రావడం చూసిన రిషి లోపలికి వెళ్లిపోతాడు. ఏంజిల్ వచ్చి.. ఇంకా రిషి ఇంటికి రాలేదు నీకు ఏమైనా తెలుసా అని అడుగుతుంది. లేదు వర్క్ ఉందేమో వస్తాడు. నువ్వు ఇంటికి వెళ్ళమని ఏంజిల్ కి వసుధార చెప్తుంది. వసు చక్రపాణి లు కంగారుగా మాట్లాడడం చూసిన ఏంజిల్ రిషి ఇక్కడ ఉన్నాడా అని అడుగుతుంది.
ఆ తర్వాత ఏంజిల్ ఇక్కడే ఉంటే డౌట్ వస్తుందని.. నేను ఇంకో పది నిమిషాల్లో వస్తాను. నువ్వు కంగారుపడకని ఏంజిల్ కి రిషి మెసేజ్ చేస్తాడు. ఆ మెసేజ్ చుసిన ఏంజిల్ ఏంటి రిషి నేను మీతో మాట్లాడుతున్నా అని తెలిసి ఇలా చేసినట్టు ఉన్నాడని డౌట్ గా అనేసరికి.. రిషి సర్ ఇక్కడ ఎందుకు ఉంటాడని వసుధార చెప్తుంది.. ఆ తర్వాత ఏంజెల్ అక్కడ నుండి వెళ్ళిపోతుంది. రిషి బయటకు వచ్చి.. నాకు ఆ ఇంటికి వెళ్లాలని లేదని చెప్తాడు. ఎందుకని వసుధార అడుగుతుంది. నీకు తెలుసు కదా అని రిషి అంటాడు. అయిన విశ్వనాథ్ సర్ కోసం అయిన వెళ్ళాలని రిషి ఇంటికి వెళ్తాడు. మరుసటి రోజు ఉదయం విశ్వనాథ్ కి కాఫీ ఇస్తుంది ఏంజిల్. అప్పుడే రిషి వాళ్ళిద్దరి దగ్గరికి వెళ్తాడు. రిషి రావడంతో ఏంజిల్ బయటకు వెళ్ళిపోతుంది. ఏమైంది మీకేమైనా గొడవ అయిందా అని విశ్వనాథ్ అడుగుతాడు. అదేం లేదని ఏంజిల్ ని పిలిచి.. మన మధ్య ఏం గొడవ లేదు కదా అని రిషి అంటాడు. నీకు లేదేమో నాకు ఉందని ఏంజిల్ అంటుంది. మనం ఫ్రెండ్స్ మాత్రమే.. ఫ్రెండ్స్ మధ్య ఇలా ఉండకూడదని రిషి చెప్పి వెళ్ళిపోతాడు. వెంటనే రిషి వెనకాల ఏంజిల్ వచ్చి.. నీ ఉద్దేశం మారదా అని అడుగుతుంది. నా ఉద్దేశ్యం, నిర్ణయం.. రెండు మారవు. ప్లీజ్ నన్ను అర్థం చేసుకోమని ఏంజిల్ కి రిషి చెప్తాడు.
మరొకవైపు కాలేజీ మేనేజర్ దగ్గరికి శైలేంద్ర వెళ్లి.. కాలేజీ ఫైనాన్షియల్ మ్యాటర్ గురించి తెలుసుకుంటాడు. నేను చెప్పినట్లు చేస్తే నీ కూతురు పెళ్లికి కావలసిన డబ్బు ఇస్తానని మేనేజర్ కి చెప్తాడు శైలేంద్ర. కాలేజీకి, జగతి కి ప్రాబ్లమ్ క్రియేట్ చేసేలా మేనేజర్ కి శైలేంద్ర ఏదో చెప్తాడు. మరొకవైపు వసుధారని ఏంజిల్ కలుస్తుంది. నువ్వు నా ప్రేమ విషయం గురించి రిషితో నువ్వే చెప్పాలి. రిషిని రమ్మని చెప్పానని అనగానే.. అప్పుడే రిషి వస్తాడు. రిషి రాగానే ఏంజిల్ ప్రేమ గురించి వసుధార అడుగుతుంది. ఏంజిల్ తన ఇష్టాన్ని చెప్పినప్పుడు, మీరు కూడా మీ నిర్ణయం చెప్పాలి కదా అని రిషితో వసుధార చెప్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |